భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డులు.. సీఐటీయూ ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ

మేడ్చల్: సీఐటీయూ అనుబంధ బీసీడబ్ల్యూ యూనియన్ ఆధ్వర్యంలో అడ్డాలపై పనిచేస్తున్న భవన నిర్మాణ కార్మికులకు లేబర్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు లేబర్ కార్డు తీసుకోవాలని సీఐటీయూ మేడ్చల్ మండల కమిటీ విజ్ఞప్తి చేసింది.
ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ మండల కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ.. లేబర్ కార్డు కలిగి ఉండటం వల్ల భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రమాదంలో మరణించిన కార్మికుడి కుటుంబానికి రూ.10 లక్షల వరకు, సహజ మరణానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం, కార్మికుడి కుమార్తె వివాహానికి రూ.30 వేలు, ప్రసవ సమయంలో రూ.30 వేలు, అంగవైకల్యానికి రూ.50 వేల వరకు ఆర్థిక సహాయం అందుతుందని వివరించారు.
అందువల్ల భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు లేబర్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం 9951408268, 7569266582, 7993929594 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీసీడబ్ల్యూ యూనియన్ జిల్లా నాయకులు అశోక్, మండల నాయకులు ఎన్. కృష్ణ, జి. శ్రీను, స్వామి, చి. కృష్ణ, ఎల్లం, ఎల్లయ్య, అస్తరమ్మ, రజిని, సుతారి గూడా శ్రీను, అనిత తదితరులు పాల్గొన్నారు.

