భగవద్గీత జ్ఞాన మందిరంలో వైభవంగా సామూహిక కుంకుమ పూజలు
* లలితా పారాయణం లక్ష్మీ అష్టోత్తర పారాయణంతో భక్తిమయంగా మారిన ఆలయ ప్రాంగణం
* విశేష అలంకరణలో అమ్మవారి దివ్య దర్శనంభక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీ
జమ్మికుంట ఆగస్టు 18 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో ని భగవద్గీత జ్ఞాన మందిరంలో అమ్మవారి సామూహిక కుంకుమ పూజలను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహించారుఈ సందర్భంగా ఆలయంలో లలితా పారాయణం లక్ష్మీ అష్టోత్తర పారాయణం భక్తిపూర్వకంగా నిర్వహించారువేద మంత్రోచ్ఛారణలుభక్తుల ఆధ్యాత్మిక ప్రార్థనలతో ఆలయ ప్రాంగణం భక్తిమయంగా మారింది. అనంతరం అమ్మవారిని వివిధ పుష్పాలతో విశేషంగా అలంకరించి భక్తులకు దివ్య దర్శనం కల్పించారుపూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భక్తులు అమ్మవారి ఆశీస్సులు పొందారుఅనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారుఅమ్మవారి కృపతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ప్రత్యేకంగా ప్రార్థించారుమహిళా భక్తులకు కృతజ్ఞతలు
సామూహిక కుంకుమ పూజల్లో పాల్గొన్న మహిళా మాతలందరికీ ఆలయ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారుభక్తిశ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి సేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలుతెలియజేశారుఅమ్మవారి అనుగ్రహం ప్రతి కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని కుటుంబ సభ్యులందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన భక్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.


