
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి:
బీఎస్పీ మండల అధ్యక్షుడిగా, చండూరు మండలానికి చెందిన కడారి సైదులు యాదవ్ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తానని పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ మండలంలో నెలకొన్న సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని తెలిపారు. తన ఎన్నిక కు సహకరించిన అభియేందర్, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.

