•అమీన్‌పూర్‌లో బీవీజీ లిక్కర్ మార్ట్‌లో అగ్ని ప్రమాదం
అమీన్‌పూర్, ఆగస్టు 16 (ప్రజావాణి): అమీన్‌పూర్‌లోని బీవీజీ లిక్కర్ మార్ట్‌లో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే సుమారు రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

