📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaబిఆర్ఎస్ కార్యకర్తకు ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

బిఆర్ఎస్ కార్యకర్తకు ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ నాయకులు

📰 Generate e-Paper Clip

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

బిఆర్ఎస్ కార్యకర్తకు ఆర్థిక సహాయం అందజేసి చండూరు మండలం బిఆర్ఎస్ నాయకులు. ఇటీవల అనారోగ్య కారణాల వల్ల మృతి చెందిన నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బోడంగిపర్తి గ్రామానికి చెందిన గ్రామ బిఆర్‌ఎస్‌ పార్టీ ఉపాధ్యక్షులు, గ్రామ పంచాయతీ 7వ వార్డు సభ్యుడు రేవెల్లి నరేష్‌ అనారోగ్య కారణాలతో అకాల మరణం చెందారు. బిఆర్ఎస్ పార్టీ కోసం తన కుటుంబాన్ని సైతం వదులుకొని కష్టపడ్డ నిరుపేద కుటుంబానికి చెందిన వారు చండూరు మండలం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొమ్మరబోయిన వెంకన్న 10 వేలు, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎత్తపు మధుసూదన్ రావు 20 వేలు, చండూరు మండలం బిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు ఉజ్జిని అనిల్ రావు సోమవారం నరేష్ కుటుంబానికి 10 వేల రూపాయలు ఇచ్చారు. పెద్ద మనసుతో మా కుటుంబానికి అండగా నిలిచిన చండూరు మండలం బిఆర్‌ఎస్ నాయకులందరికీ నరేష్ కుటుంబ సభ్యులు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కట్కూరి సత్తయ్య, చండూరు మండలం బిఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి బొడ్డు సతీష్ గౌడ్, మాజీ కౌన్సిలర్ అనపర్తి శేఖర్, వరకాల శ్రవణ్, ఎండి సత్కర్, వరకాల శ్రవణ్, ఎండీ సతీర్, నరసింహస్వామి, చేవర్కాల అంబేద్కర్ నరసింహులు ,కాశీమల్ల అనిల్, కుటుంబ సభ్యులు రేవల్లి చంద్రయ్య,రేవల్లి శ్రీను రేవెల్లి మహేష్ కొనసాగుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.