📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguప్రజా భద్రతే ధ్యేయంగా పస్రా పోలీస్ స్టేషన్ గోడ చిత్రాలు

ప్రజా భద్రతే ధ్యేయంగా పస్రా పోలీస్ స్టేషన్ గోడ చిత్రాలు

📰 Generate e-Paper Clip

పోలీస్ స్టేషన్ గోడపై సామాజిక అంశాల చిత్రాలు.
SHE TEAMS, CYBER CRIME పై పోలీస్ స్టేషన్ లో చిత్రాలు పోలీస్ స్టేషన్ గోడకు మేడారం తల్లుల చిత్రం
STOP DRUGS – పస్ర పోలీస్ స్టేషన్ గోడపై గట్టి సందేశం

పస్రా ఎస్సై తాజుద్దీన్

ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)

ప్రజలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు గోవిందరావుపేట పస్రా పోలీస్ స్టేషన్ ఆవరణ గోడను రంగురంగుల చిత్రాలతో అలంకరించారు.
ఎస్సై తాజుద్దీన్ ఆధర్యంలో వేసిన ఈ చిత్రాల్లో సైబర్ క్రైమ్, డ్రగ్స్ నిర్మూలన, చైల్డ్ ప్రొటెక్షన్, మహిళా భద్రత, రోడ్డు భద్రత తదితర అంశాలు ఉన్నాయి.
STOP DRUGS పేరుతో డ్రగ్స్ కు వ్యతిరేకంగా, CYBER CRIME పేరుతో ఆన్ లైన్ మోసాలపై, CHILD PROTECTION పేరుతో చిన్నారుల రక్షణపై, WEAR SEAT BELT పేరుతో రోడ్డు భద్రతపై చిత్రాలు వేశారు. అలాగే SHE TEAMS మరియు WOMEN SAFETY WING లోగోలతో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చారు.
ఈ గోడకు ప్రత్యేక ఆకర్షణగా మేడారం సమ్మక్క-సారలమ్మ గద్దెలను సూచించే సంప్రదాయ చిత్రాన్ని కూడా వేశారు. దీంతో గోడ అందంగా ఉండడంతో పాటు స్థానిక గిరిజన సంస్కృతికి నిదర్శనంగా నిలిచింది.పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలు ఈ చిత్రాలను చూసి అవగాహన పెంచుకునేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పస్రా ఎస్సై తాజుద్దీన్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.