పోతుగల్ గ్రామంలో వన మహోత్సవ కార్యక్రమం…..
రంగారెడ్డి జిల్లా బ్యూరో. ఆగస్టు 25. ప్రజావాణి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో గ్రామ సర్పంచ్ పామెన నర్సింలు ఉపసర్పంచ్ నేరెట్ల సావిత్రి. మరియు వార్డు సభ్యుల ఆధ్వర్యంలో మంగళవారం గ్రామపంచాయతీ ముంగిట మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రక్కన గల స్థలములో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామ సర్పంచ్ పామెన నర్సింహులు మాట్లాడుతూ గ్రామంలో పచ్చదనాన్ని పెంపొందించడంతోపాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి నీ సంరక్షించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రెటరీ అశోక్ జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాఠశాల సిబ్బంది పోతుగల్ యువజన సంఘం అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు గ్రామ ప్రజలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


