📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadనాకు న్యాయం చేయండి ఆర్ డి ఓ కు మొరపెట్టుకున్న వృద్ధురాలు

నాకు న్యాయం చేయండి ఆర్ డి ఓ కు మొరపెట్టుకున్న వృద్ధురాలు

📰 Generate e-Paper Clip

నాకు న్యాయం చేయండి ఆర్ డి ఓ కు మొరపెట్టుకున్న వృద్ధురాలు

తన కుమారులు భుక్తం ఇవ్వకుండా తనను రోడ్డుపై వదిలేశారని ఆవేదన

 

నా కుమారులు నాకు భుక్తం ఇవ్వకుండా, నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఓ వృద్ధ మహిళా ఆర్డీవోకు గ్రీవెన్స్ సెల్ లో సుమారు 20 రోజుల క్రితం ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే పెద్ద వంగర మండలం పోచారం తండా కు చెందిన లూనావత్ సాయమ్మ భర్త బాలు అనే వ్యక్తి కి ఇద్దరు కుమారులు ఉన్నారని, చిన్నతనంలోనే తన భర్త ఆమెను వదిలేసి రెండో పెళ్లి చేసుకున్నాడని, అప్పుడు నాకు భుక్తం కింద నాలుగు ఎకరాల భూమిని పెద్దల సమక్షంలో నాకు ఇవ్వడం జరిగింది అని, ఆమె తెలిపారు. చిన్నపిల్లలను 40 ఏళ్ల కుమారులను చేసి పెళ్లిళ్లు చేసి, ఇద్దరికీ రెండు ఎకరాల చొప్పున నాలుగు ఎకరాల భూమిని వారికి పట్టా చేయించానని ఆమె పేర్కొన్నారు. పట్టా చేసిన అనంతరం కొంతకాలం మంచిగానే చూసుకుని ఇప్పుడు నా యొక్క యోగక్షేమాలను పట్టించుకోకుండా రోడ్డున పడేశారని ఆమె ఆర్డీవో ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తన పెద్ద కుమారుడు అనుకూలంగా ఉన్నాడని తన చిన్న కుమారుడు, తనని మానసికంగా వేధిస్తూ తన యొక్క బాగోగులు పట్టించుకోకుండా ఇబ్బందుల గురిచేస్తున్నాడని ఆమె తెలిపారు. గత కొద్ది రోజుల క్రితం నా ఆరోగ్యం క్షీణించి గుండెకు స్టంట్ వేయడం జరిగిందని, మళ్లీ ఇప్పుడు కొత్త స్టంట్ వేయాలని డాక్టర్లు చెబుతున్న, నా చిన్న కుమారుడు సహకరించకుండా, నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆమె తెలిపారు. ఈ విషయంపై స్థానిక ఆర్డిఓ వారిద్దరికీ నోటీసులు ఇచ్చి, సోమవారం కార్యాలయానికి పిలిపించి అడగగా, తన చిన్న కుమారుడు, ఎవరి మాట వినను అంటూ తన ఇష్టానుసారంగా దుర్భాషలాడుతున్నాడని, నిన్ను చంపితే ఈ సమస్య పరిష్కారం అవుతుందని నన్ను బెదిరిస్తున్నాడని ఆమె మీడియాకు తెలిపారు. ఈ అంశంపై ఆర్డీవో ని తన భుక్తం గురించి అడిగితే పెద్ద వంగర మండల ఎమ్మార్వో కు రాస్తున్నానని మీరు అక్కడ వెళ్లి కలవమని చెప్పారని తెలిపారు. కావున జిల్లా ఉన్నతాధికారులు స్పందించి, గతంలో ఇద్దరి కుమారులకు పంచిన నాలుగు ఎకరాల భూమి పట్టాను రద్దుచేసి తన పేరు మీద పట్టా చేయాలని లూనావత్ సాయమ్మ కోరారు. అదేవిధంగా తన చిన్న కుమారుడి నుండి తనకు ప్రాణహాని ఉందని కావున అధికారులు తనకు రక్షణ కల్పించాలని ఆమె కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.