బెజ్జంకి, ఆగస్టు 11(ప్రజావాణి)
కొత్త పింఛన్ల కోసం అర్హులైన లబ్ధిదారులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు దూశెట్టి ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులతో పాటు పైలేరియా, డయాలసిస్ వంటి ప్రత్యేక కేటగిరీలకు చెందిన అర్హులకు చేయూత పథకం కింద పింఛన్లు అందనున్నాయని తెలిపారు.
దివ్యాంగులకు ₹4,016, ఇతర ప్రధాన కేటగిరీలకు ₹2,016 చొప్పున పింఛన్ అందనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు అవసరమైన ధృవీకరణ పత్రాలతో గ్రామ పంచాయతీ కార్యదర్శి లేదా ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.అర్హత ఉన్న ఒక్కరూ ఈ అవకాశాన్ని కోల్పోవద్దని, సామాజిక భద్రత ప్రతి ఒక్కరి హక్కు అని దూశెట్టి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. అర్హులైన వారు ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
