📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetనంగునూరులో ఘనంగా మార్కండేయ శోభాయాత్ర

నంగునూరులో ఘనంగా మార్కండేయ శోభాయాత్ర

📰 Generate e-Paper Clip

నంగునూరు, ఆగస్టు 28 (ప్రజావాణి): రాఖీ పౌర్ణమి పండుగ పురస్కరించుకుని నంగునూరు మండల కేంద్రంలో శుక్రవారం మార్కండేయ స్వామి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా మార్కండేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతులు సమర్పించారు.అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అలంకరించిన వాహనంపై ఏర్పాటు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. నంగునూరు ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి నామస్మరణలు చేశారు. డప్పుచప్పుళ్లు, భక్తిగీతాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. మహిళలు, యువత, పద్మశాలీ సంఘం సభ్యులు ఉత్సాహంగా పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేశారు.మార్కండేయ స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. పండుగ సందర్భంగా భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలీ సంఘం నాయకులు, సభ్యులు, మహిళలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.