నంగునూరులో ఘనంగా మార్కండేయ శోభాయాత్ర
నంగునూరు, ఆగస్టు 28 (ప్రజావాణి): రాఖీ పౌర్ణమి పండుగ పురస్కరించుకుని నంగునూరు మండల కేంద్రంలో శుక్రవారం మార్కండేయ స్వామి శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా మార్కండేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, మంగళహారతులు సమర్పించారు.అనంతరం స్వామివారి చిత్రపటాన్ని అలంకరించిన వాహనంపై ఏర్పాటు చేసి శోభాయాత్రను ప్రారంభించారు. నంగునూరు ప్రధాన వీధుల గుండా సాగిన శోభాయాత్రలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి...