దుండిగల్‌లో పచ్చదనం పెంపునకు ప్రాధాన్యం
వేస్ట్ టు ఎనర్జీ సంస్థలో మొక్కలు నాటిన అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్ పర్యావరణ పరిరక్షణతో పాటు పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దుండిగల్ వేస్ట్ టు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రాంగణంలో పరిశ్రమల శాఖ, ఫ్యాక్టరీల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పారిశ్రామిక ప్రాంతాల్లో కాలుష్య నియంత్రణకు ప్రణాళికాబద్ధంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యతను సంబంధిత యాజమాన్యాలు తీసుకోవాలని అన్నారు. పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు పరిశ్రమల యాజమాన్యాలు సామాజిక బాధ్యతగా సీఎస్‌ఆర్, వనమహోత్సవం వంటి కార్యక్రమాల్లో చురుకుగా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జాయింట్ డైరెక్టర్/జనరల్ మేనేజర్ డి. వినయ్ కుమార్, డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ మనోహర్ రెడ్డి, దుండిగల్ వేస్ట్ టు ఎనర్జీ సంస్థ ప్రతినిధులు రమేష్, గోపినాథ్, సిబ్బంది, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

