📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadకోటగిరి ఎస్.సి కాలనీలో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు.

కోటగిరి ఎస్.సి కాలనీలో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు.

📰 Generate e-Paper Clip

కోటగిరి ఎస్.సి కాలనీలో ఘనంగా తల్లి పాల వారోత్సవాలు.

కోటగిరి:-మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రం కోడ్ 155 ఎస్.సి కాలనీలో తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వ హించారు.ఈ సందర్భంగా అంగన్వాడీ ఉపాధ్యాయురాలు బి.గంగమణి,ఏఎన్ఎం మంజుల మాట్లాడుతూ.పుట్టిన 6 నెలల వరకు బిడ్డకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని,ఆ తర్వాత పౌష్టికాహారంతో పాటు తల్లిపాలు కొనసాగించాలని తల్లులు,గర్భిణీలు,బాలింతలకు ఆమె సూచించారు.పిల్ల ల్లో పోషకాహార లోపం రాకుండా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తా మని ఆమె అన్నారు. అనంతరం టేబుల్ పై గుడ్లు,ముర్కులు,ఆకుకూరలు, పండ్లు,బాలమృతం,వంటి పోషకాహార పదార్థాలను ప్రదర్శించి వాటి వల్ల కలిగే లాభాలను ఆమె తల్లులకు తెలియజేశారు.తదనంతరం కేంద్రంలోని చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులకు ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ స్వప్న,వార్డ్ మెంబర్ బురుగుల లక్ష్మి,పెద్ద సంఖ్యలో తల్లులు,గర్భిణీలు, బాలింతలు,చిన్న పిల్లలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.