📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పొరుమామిళ్ళలో...

జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పొరుమామిళ్ళలో కీలక చర్చలు

📰 Generate e-Paper Clip

పొరుమామిళ్ళ: ఆగస్టు 25 ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పొరుమామిళ్ళ మండల కేంద్రంలో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోటపాటి వెంకటరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 7 మండలాల నుండి నాయకులు, వీర మహిళలు, జనసైనికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఎన్నికల వ్యూహం – భవిష్యత్ ప్రణాళికలపై చర్చ:

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉంది? ఏయే స్థానాల్లో పోటీ చేస్తే విజయకేతనం ఎగురవేయవచ్చు? అనే అంశాలపై నాయకులు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లోకి వెళ్తూనే, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అనుసరించాల్సిన భవిష్యత్ ప్రణాళికలను ఈ సందర్భంగా ఖరారు చేశారు. ఈ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ తుడిమెళ్ళ మురళి కృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు బద్వేల్ నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోటపాటి వెంకటరామ్, నందకిశోర్, ఎక్కులూరి సిద్దు, ఈశ్వర్ రెడ్డి, పుల్లూరు ఖలీల్, పొత్తపి మనోహర్, శ్రీకాంత్ రెడ్డి, బి.కోడూరు శివ తదితరులు పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.మండలాల వారీగా పాల్గొన్న ప్రముఖులు: బద్వేల్ మండలం: నీటి సంఘం చైర్మన్ కొర్రపాటి సురేంద్ర, బద్వేల్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ చిన్ని సుబ్బారావు, బలిజ సంఘం అధ్యక్షుడు సింగం శెట్టి వెంకట సుబ్బయ్య, తోట బాల సుబ్రహ్మణ్యం, దద్ధం వెంకటేష్, గాజుల వంశీ కృష్ణ, సురేంద్ర, సుధాకర్, వంశీ కృష్ణ. పొరుమామిళ్ళ మండలం: కోటపాటి వెంకటేష్, ఇమ్రాన్, లకిడి వంశీ, వీర మహిళ శీలం శెట్టి లక్ష్మీ, నగరి రమణయ్య, రామ్ మోహన్, వెంకట సుబ్బయ్య, సుబ్బారాయుడు, ఎక్కులూరి మల్లికార్జున్, దగ్గుబాటి శివ.గోపవరం మండలం: మోదం లక్ష్మీ నారాయణ, బండారు శ్రీకాంత్, వెంకటయ్య, వర్ధన్, రామయ్య. కాశినాయన మండలం: ప్రసన్న కుమార్, పసుపులేటి జమాలయ్య, హరి కృష్ణ, చిన్నయ్య సనామాల, సిద్దయ్య, పవన్ కుమార్, బాల సిద్దయ్య, రాహుల్, భరత్, మనోహర్, షరీఫ్.స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అభ్యర్థుల విజయమే ధ్యేయంగా ప్రతి కార్యకర్త శ్రమించాలని, నియోజకవర్గంలో జనసేన పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని ఈ సందర్భంగా నాయకులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం నియోజకవర్గ జనసైనికుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.