జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం: స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా పొరుమామిళ్ళలో కీలక చర్చలు
పొరుమామిళ్ళ: ఆగస్టు 25 ప్రజావాణి బద్వేల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేడెక్కాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన జెండాను రెపరెపలాడించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పొరుమామిళ్ళ మండల కేంద్రంలో జనసేన పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం అత్యంత వైభవంగా జరిగింది. జనసేన పార్టీ సీనియర్ నాయకులు కోటపాటి వెంకటరామ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి నియోజకవర్గంలోని 7 మండలాల నుండి నాయకులు, వీర మహిళలు, జనసైనికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు....