నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూర్ మున్సిపాలిటీ పరిధిలో చేనేత వస్త్రాల అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సు ఘనంగా జరిగింది. ఈ ముఖ్య అతిథులుగా జాతీయ స్థాయి ప్రముఖులు. నేషనల్ హ్యాండ్‌లూమ్ అంబాసిడర్, మిస్ ఆసియా కుమారి రష్మీ ఠాకూర్ మాట్లాడుతూ… “చేనేత అంటే మన దేశ సంస్కృతి. చండూర్ లాంటి ప్రాంతాల చేనేతకు ఎంతో చరిత్ర ఉంది. ఒక చేనేత చీర వెనుక ఒక కుటుంబం నెల రోజుల శ్రమ ఉంటుంది. టీటీడీ వస్త్రాల కమిటీ చైర్మన్, తెలంగాణ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కమిషనర్ ఎస్. అరుణ్ కుమార్ మాట్లాడుతూ… “తిరుమల శ్రీవారికి సైతం చేనేత పట్టు వస్త్రాలనే సమర్పిస్తాము. అంత పవిత్రమైన చేనేతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. తెలంగాణ పోచంపల్లి ఇక్కత్ కు ప్రపంచ ఖ్యాతి ఉంది. జాతీయ అవార్డు గ్రహీత పద్మశ్రీ గజం అంజయ్య మాట్లాడుతూ… “నా జీవితమంతా మగ్గం మీదనే గడిచింది. చేనేత నాకు పద్మశ్రీ తెచ్చిపెట్టింది. చేనేతలో ఆకలి ఉండదు, ఆత్మగౌరవం ఉంటుంది. ప్రభుత్వం నూలుపై సబ్సిడీ, పింఛన్లు ఇచ్చి ఆదుకోవాలి. చందూర్ ప్రాంత చేనేత కార్మికులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి” అని పేర్కొన్నారు. ప్రముఖ డిజైనర్ కోడి శ్రీనివాస్ మాట్లాడుతూ… “చేనేతకు కొత్త డిజైన్లు జోడిస్తే యువత కూడా ఇష్టపడుతుంది. చేనేతను ఫ్యాషన్ ఇండస్ట్రీతో అనుసంధానం చేస్తే చందూర్ చేనేతకు మహర్దశ వస్తుంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం చైర్మన్ పున ధర్మేందర్, పద్మశాలి సంఘం అధ్యక్షులు గుర్రం బిక్షమయ్య, పులిపాటి ప్రసన్న, ట్రస్ట్ చైర్మన్ కోమటి వీరేశం, చైర్మన్ రావిరాల నగేష్, కార్మిక సంఘం అధ్యక్షులు రాపోలు వెంకటేశం, సీపీఎస్ వ్యవస్థాపకులు రాపోలు ప్రభాకర్, యువజన సంఘాల అధ్యక్షులు గంజి గంగాధర్, గంజి శ్రీనివాసులు, గంజి శ్రీనివాసులు, గంజి వెంకటేశం జు వెంకటేశం, ఏల శ్రీనివాసులు, తిరందాసు సుధా శ్రీనివాసులు, గుర్రం కవిత రాము, కందగట్లఋషి, కిరణ్, చిలుకూరి మణి, రవి మరియు చేనేత కార్మికులు పనిచేస్తున్నారు.

