📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఘట్‌కేసర్ డివిజన్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు కొమ్మిడి మహిపాల్ రెడ్డి

ఘట్‌కేసర్ డివిజన్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు కొమ్మిడి మహిపాల్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని ఎన్‌ఎస్‌సీ నగర్, బొక్కనిగూడ, చందుపట్లగూడ, శివారెడ్డిగూడ ప్రాంతాల్లో శ్రీ పోచమ్మ, చిత్తారమ్మ తల్లుల బోనాల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంగా డివిజన్ ప్రజలకు బీజేపీ ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ పవిత్ర పర్వదినాన ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ పోచమ్మ, చిత్తారమ్మ తల్లుల ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు.

బోనాల ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.