ఘట్‌కేసర్ డివిజన్ ప్రజలకు బోనాల శుభాకాంక్షలు కొమ్మిడి మహిపాల్ రెడ్డి
ఘట్‌కేసర్: ఘట్‌కేసర్ డివిజన్ పరిధిలోని ఎన్‌ఎస్‌సీ నగర్, బొక్కనిగూడ, చందుపట్లగూడ, శివారెడ్డిగూడ ప్రాంతాల్లో శ్రీ పోచమ్మ, చిత్తారమ్మ తల్లుల బోనాల మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్న సందర్భంగా డివిజన్ ప్రజలకు బీజేపీ ఘట్‌కేసర్ డివిజన్ అధ్యక్షుడు కొమ్మిడి మహిపాల్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ పవిత్ర పర్వదినాన ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. శ్రీ పోచమ్మ, చిత్తారమ్మ తల్లుల ఆశీస్సులు ప్రజలందరిపై...