బెజ్జంకి, ఆగస్టు 25 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గూడెల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటి సంరక్షణ బాధ్యతను కూడా తీసుకోవాలని గ్రామ ప్రజలకు, విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పరశురాములు, వార్డు సభ్యులు నూనె రాములు, శ్రీనాథ్ రెడ్డి, బోనాల రమేష్, బోనాల లక్ష్మి, పాఠశాల హెచ్‌ఎం రేవతి, పంచాయతీ కార్యదర్శి యాదగిరి, ఉపాధ్యాయులు శ్రీనివాస్, అంగన్‌వాడీ టీచర్ సరోజన, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

