*
*చించోడు సర్పంచ్ రాకాల శ్రీనివాస్ చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం*
షాద్ నగర్ ప్రజావాణి ఆగస్టు 25: రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ కిరణ్మయి ఆదేశాల మేరకు చించోడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రి వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని చించోడు సర్పంచ్ రాకాల శ్రీనివాస్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ రాకాల శ్రీనివాస్ నేరేడు మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం ఎంఎల్‌హెచ్‌పీ వైద్యాధికారి డాక్టర్ సంధ్యారాణి నిమ్మ మొక్కను, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు జామ మొక్కను నాటారు. గ్రామ వార్డు సభ్యులు, విలేజ్ సెక్రటరీ, వైద్య సిబ్బంది ఒక్కొక్కరు మొక్కలు నాటి వాటికి నీరు పోశారు.
ఆసుపత్రి ఆవరణలో జామ, నిమ్మ, నేరేడు తదితర రకాల మొత్తం 12 మొక్కలను నాటినట్లు హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు తెలిపారు. మొక్కలను నాటి వాటి సంరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
కార్యక్రమంలో వార్డు సభ్యులు ఉమామహేశ్వర్ నాయక్, కుమ్మరి శేఖర్, విలేజ్ సెక్రటరీ జయపాల్ రెడ్డి, ఎంఎల్‌హెచ్‌పీ వైద్యాధికారులు డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ ప్రవీణ, హెల్త్ ఎడ్యుకేటర్ జె. శ్రీనివాసులు, హెల్త్ సూపర్వైజర్ శ్రీరామ, ల్యాబ్ టెక్నీషియన్ అశోక్ కుమార్, స్టాఫ్ నర్స్ అరుణ, ఏఎన్‌ఎంలు అనురాధ, పుష్ప, మధువాణి, ఆసుపత్రి కాంటిజెంట్ వర్కర్లు మనెమ్మ, శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
చించోడు ఆసుపత్రిలో వన మహోత్సవం
RELATED ARTICLES

