గుడిసెల్లో నిల్వ చేసిన సుమారు 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం
అక్రమ నిల్వలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
ఎస్సై పి. అభిలాష్
కోహెడ, ఆగస్టు 10 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యంపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు.నమ్మదగిన సమాచారం మేరకు కోహెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామ శివారులో ఉన్న చొక్కారావు ఓపెన్ ఫ్లాట్లోని గుడిసెల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ యొక్క తనిఖీల్లో సుమారు 5 క్వింటాళ్ల అక్రమ రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు గుర్తించిన నలుగురు వ్యక్తులపై పోలీసులు చర్యలు చేపట్టారు.ఈ సందర్భంగా కోహెడ ఎస్సై మాట్లాడుతూ.. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం, తరలించడం, విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారికి జైలు శిక్ష కూడా తప్పదని కోహెడ ఎస్సై అభిలాష్ హెచ్చరించారు.

