జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు.
రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నం రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు.రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి, రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి డిసిపి జిల్లా డైరెక్టర్, చెల్పూర్ సింగిల్ విండో చైర్మన్ గండ్ర సత్యనారాయణ రెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య హాజరయ్యారు.మండల, జిల్లా స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మరియు ప్రస్తుత ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… దేశ అభివృద్ధిలో రాజీవ్ గాంధీ కీలక పాత్ర పోషించారని, ముఖ్యంగా ఐటీ మరియు సాంకేతిక రంగాల్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు దేశాన్ని ఆధునిక సాంకేతిక యుగం వైపు నడిపించాయని గుర్తుచేశారు.రాజీవ్ గాంధీ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని నాయకులు పేర్కొన్నారు.

