కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని, స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రేగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్నం రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిర్వహించారు.రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఇందిరాగాంధీ విగ్రహానికి, రాజీవ్ గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమానికి డిసిపి  జిల్లా డైరెక్టర్, చెల్పూర్ సింగిల్ విండో చైర్మన్ గండ్ర సత్యనారాయణ రెడ్డి,...