కాంగ్రెస్ గ్రామ శాఖల బలోపేతానికి నూతన అధ్యక్షుల నియామకం
పోచారం: కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖలను బలోపేతం చేసే లక్ష్యంతో పోచారం డివిజన్ పరిధిలోని పలు గ్రామాలకు నూతన అధ్యక్షులను నియమించారు. నూతన అధ్యక్షులకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇటికాల కృష్ణారెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను గుర్తించి ప్రభుత్వం...