కర్కాల గ్రామంలో ఇసుక వేలం
తొర్రూరు మండలం కర్కాల గ్రామంలో 224 ట్రిప్పుల ఇసుకను రెవిన్యూ అధికారులు సీజ్ చేయడం జరిగింది. నేడు ఇసుకను వేలం వేయగా దాదాపు 27 మంది సభ్యులు ఈ వేలం పాటలో పాల్గొన్నట్లు తొర్రూర్ తహశీల్దార్ గడిల శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రమంగా ఇసుకను నిలువచేసిన రవాణా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయ
ని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిధంగా ఈ అక్రమ ఇసుక వేలంలో 27 మంది సభ్యులు పాల్గొనగా 22 కుప్పలు 22 మందికి వేలంలో వచ్చాయని, ఈ వేలంలో వచ్చిన ఖరీదు 3,88900 రూపాయలు, రావడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ నరసయ్య, ఆర్ ఐ ,రెవిన్యూ సిబ్బంది, ఇసుక కొనుగోలుదారులు గ్రామీణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

