📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadఎత్తొండ క్యాంప్లో నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ.

ఎత్తొండ క్యాంప్లో నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ.

📰 Generate e-Paper Clip

ఎత్తొండ క్యాంప్లో నూతన గ్రామ పంచాయతీ భవనానికి భూమిపూజ.

రూ.20 లక్షల వ్యయంతో నూతన జీపీ భవన నిర్మాణం.

ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సర్పంచ్ వీరమణి అర్జున్ గ్రామాభివృద్ధికి శ్రీకారం.

ఎత్తొండ క్యాంప్లో ఘనంగా పంచాయతీ భవన శంకుస్థాపన కార్యక్రమం.

కోటగిరి/ప్రజావాణి:-పరిపాలన సౌలభ్యం కోసం నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని నిర్మిస్తున్నామని ఎత్తొండ క్యాంప్ సర్పంచ్ గైని వీరమణి అర్జున్ తెలిపారు.గురువారం కోటగిరి మండలంలోని ఎత్తొండ క్యాంప్ గ్రామంలో ఆమె పాలకవర్గ సభ్యులు,గ్రామ పెద్దలతో కలిసి నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సర్పంచ్ గైని వీరమణి అర్జున్ మాట్లాడుతూ.ఎన్ఆర్ఈజీఎస్ గ్రాంట్స్ క్రింద రూ.20 లక్షల వ్యయంతో నూతన జీపీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశామని అన్నారు.గ్రామ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు,ప్రభుత్వ నిధులను సద్వినియోగం చేసుకుని గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోనేరు తరుణ్ సాయి తేజ,పంచాయతీ కార్యదర్శి ఉదయ భాస్క ర్,వార్డు సభ్యులు జి.రాములు,ఎస్.కే.ఇక్బాల్,సాలియా బేగం జమీర్,జీ.శివకృష్ణ,సునీత,రాజేశ్వరి,శైలజ,గ్రామ పెద్దలు,ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.