నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
చండూర్ మార్కెట్ యార్డ్‌లో వడ్ల దొంగతనం, దొంగతనం చేసిన వారిని బెదిరించి, భయపెట్టి దోపిడి చేసిన మొత్తం 11 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి నుండి రూ. 9.80 లక్షల నగదు, 11 సెల్ ఫోన్లు, ఒక బొలెరో వాహనం (TS 07 UK 4505) స్వాధీనం చేసుకున్నట్లుగా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టిక్. రాము, సబ్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్ తెలిపారు. గురువారం చండూర్ పోలీస్ స్టేషన్‌లలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశం సీఐ మాట్లాడుతూ… తేలుకుంట్ల శ్రీనివాసులు తెలియజేసిన మేరకు చండూర్ పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ 103/2026 యూ/ఎస్ 331(4), 305(ఏ), 238, 308(5) ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్ఎస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చందూర్ వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని పలు దఫాలుగా దొంగతనం చేసి సూర్యాపేటలో విక్రయించిన ముగ్గురు నిందితులను చండూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ దొంగతనం చేసిన వారిని బెదిరించి, భయపెట్టి రూ.5 లక్షలు డిమాండ్ చేసి వసూలు చేసిన ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశారు. కనగల్ మండలం, కురంపల్లి గ్రామంలోని మహావీర్ పారాబాయి రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు 2025-26 ఖరీఫ్ & రబీ సీజన్‌కు సంబంధించిన ప్రభుత్వ ధాన్యం సుమారు 25,000 క్వింటాళ్లను చందూర్ వ్యవసాయ మార్కెట్ గోదాంలో నిల్వ చేశారు. దశలవారీగా ధాన్యాన్ని మిల్లుకు తరలించిన అనంతరం సుమారు 13,000 క్వింటాళ్లు గోదాంలో ఉండాల్సి ఉంది. అయితే గోదాం పరిశీలించగా షట్టర్ తాళం వద్ద ధాన్యం చిందరవందరగా ఉండటం, బస్తాలు గుంజిన ఆనవాళ్లు కనిపించాయి. లెక్కలు పరిశీలించగా సుమారు 600–700 బస్తాల ప్రభుత్వ ధాన్యం, విలువ సుమారు రూ.7 లక్షలు, గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ తాళంతో రాత్రివేళ దొంగిలించినట్లు పేర్కొన్నారు. కేసు ఫిర్యాది తెలుకుంట్ల శ్రీనివాసులు తేదీ: 22.08.2026న ఫిర్యాదు ఇవ్వగా కేసు నమోదు అయింది. ఫిర్యాదుతో విచారణ చేయగా, నేరస్థుడు ఏ-1 చందూర్ వ్యవసాయ మార్కెట్ నందు ట్రేడ్ లైసెన్సు కలిగి ఉంటూ చిరుధాన్యాలు అమ్ముతున్నాడు. అలాగే అప్పుడప్పుడు వ్యవసాయ మార్కెట్ నందు హమాలీగా కూడా పనిచేస్తుంటాడు. గత రెండు నెలల క్రితం ఏ-1 వ్యవసాయ మార్కెట్ నందు గోదాం కీ దొరకగా, దానితో రాత్రి సమయంలో ఏ-2 & ఏ-3 ల సహాయంతో బొలెరో బండి నెంబర్ TS 07 UK 4505 లో వడ్లు దొంగతనం చేసి సూర్యాపేట మార్కెట్‌లో అమ్ముకునేవాడు. ఇదే రోజు తేదీ: 18.07.2026న రాత్రి కూడా ఏ-2 ని తీసుకెళ్లి TS 07 UK 4505 బండిలో వడ్లు దొంగతనంగా లోడ్ చేస్తుండగా, అదే సమయంలో ఏ-4 నుండి ఏ-11 వరకు దొంగతనం చేస్తున్న ఏ-1 & ఏ-2 లను పట్టుకొని, వారిని భయపెట్టి, బెదిరించి ఏ-1 వద్ద 5 లక్షల రూపాయలకు రూ. ఇందులో ఏ-12 వడ్లు దొంగతనంగా అమ్ముకుంటున్నారు అని ఏ-4 ద్వారా తెలిసి నేరస్థుల వద్దకు వెళ్లి ఏ-4 నుండి ఏ-11 లు బెదిరిస్తుండగా వీడియో, ఫోటో తీసి కొద్ది సేపు ఉండి వెళ్లేదని తెలిపారు. ఈ కేసును నల్గొండ డీఎస్పీ కె. శివరాంరెడ్డి పర్యవేక్షణలో, చందూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టి. రాము ఆధ్వర్యంలో త్వరితగతిన ఛేదించిన ఎస్సై జె. శివకుమార్ వారి సిబ్బంది జి. శివరాం, వి. రమేష్, ఏ. నరేందర్, బి. రాజు, కె. కృష్ణ కౌశిక్ లను నల్లగొండ ఎస్పీ శరత్ చంద్ర పవర్ ఐపీఎస్ వారిని అభినందించారు.

