📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఆగస్టు 10న జిల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం

ఆగస్టు 10న జిల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం

📰 Generate e-Paper Clip

ఆగస్టు 10న జిల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం

క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా రైతు కార్మిక కూలీల వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ అఖిలభారత కిసాన్ సభ సిఐటియు అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపుమేరకు ఆగస్టు 10న నిర్వహించనున్న దేశవ్యాప్త జైల్ బరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎండి యాకూబ్ తొర్రూర్ సిఐటియు జిల్లా జిల్లా కార్యదర్శి జమ్ముల శ్రీను వారు పిలుపునిచ్చారు శుక్రవారం రోజున తొర్రూర్ ప్రజాసంఘాల ఆఫీసులో భవన నిర్మాణ జిల్లా సహాయ కార్యదర్శి మార్క సాంబయ్య అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎండి యాకూబ్ శ్రీను మాట్లాడుతూ విదేశీ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల దేశంలోని వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి రైతులు దివాలా తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు స్వామినాథ కమిషన్ సిఫారసుల మేరకు రైతు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వాలని రుణ విమోచన చట్టం చేయాలని విద్యుత్తు సవరణ బిల్లును నూతన విత్తన చట్ట లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు దేశ ప్రయోజనాలను అమరికకు తాకట్టు పెడుతూ దేశ భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతూ ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నారు మూడు నల్ల చట్టాల కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రైతాంగం ఉద్యమిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రధాన నరేంద్ర మోడీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి నాడు చట్టాలను ఉపసంహరించుకున్నారని ఇప్పుడు దొడ్డి దారిన అవే చట్టాలను అమలుకు కోరుకుంటున్నారు రైతులకు ఉద్యమ సమయంలో లెక్కపోరకంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి విబిజి రాంజీ పథకాన్ని తెచ్చారని ఈ పథకం వ్యవసాయ కూలీల పొట్ట కొట్టే విధంగా ఉందన్నారు కేంద్ర ప్రభుత్వం గతంలో 90 శాతం నిధులు ఇస్తే కొత్త చట్ట ప్రకారం కేవలం 60 శాతం మాత్రమే నిధులు ఇచ్చే అవకాశం ఉందని 40 శాతం రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుందన్నారు బిజెపి అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రతి సంవత్సరం ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ వస్తుందని చట్టాన్ని పూర్తిగా రద్దు చేసే కుట్రలో భాగమేనన్నారు స్వాతంత్రానికి పూర్వం సాధించుకున్న 29 కార్మిక చట్టాల ను రద్దుచేసి నాలుగు లేబర్ కోళ్లను తెచ్చిందని కార్మికులను మరింత కట్టు బానిసలుగా శ్రమదోపిడిని చేసే విధంగా కార్పొరేట్ పెట్టుబడిదారులకు మరింత సంపద పోగుపడే విధంగా చట్టాలు తెచ్చారన్నారు దేశభక్తి పేరుతో సంపన్నుల కొమ్ముకాస్తూ పేద బడుగు బలహీన వర్గాల నడ్డి వీరిచే చట్టాలను రద్దుచేసి పాత చట్టాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్లు చేశారు ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు దొనక దుర్గయ్య ఎండి సెమినా అంద మంజుల యాకమ్మ నాగమణి తిమ్మిడి రవి వెంకటేష్ రాధ సౌజన్య పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.