📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అశోక్ గౌడ్    

ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అశోక్ గౌడ్
   

📰 Generate e-Paper Clip

ఇనుగుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అశోక్ గౌడ్
   
ప్రజావాణి,ఇనుగుర్తి: కాంగ్రెస్ పార్టీ ఇనుగుర్తి మండల అధ్యక్షులుగా యువ ప్రజా నాయకులు బైరు అశోక్ గౌడ్
ను ప్రకటిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షురాలు డా.ఉమా మురళి నాయక్ శుక్రవారం ప్రకటన విడుదల చేశారు. చిన్ననాగారం గ్రామానికి చెందిన అశోక్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, నాయకునిగా అంచలంచలుగా ఎదిగారు. పార్టీ అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉన్న సమయంలోనూ ఎంతోమంది పార్టీని వీడినప్పటికీ అశోక్ గౌడ్ పార్టీలో ఉంటూ ప్రజలకు అండగా అండగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేశారని పార్టీ బలంగా విశ్వసిస్తోంది. అందుకే అశోక్ గౌడ్ లో సమస్యలపై పోరాట పటిమ,నాయకత్వ లక్షణాలు అకుంఠిత కార్యదీక్షత ఎంతగానో  పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గతంలో నెల్లికుదురు ఉమ్మడి మండలానికి కాంగ్రెస్ అధ్యక్షునిగా మూడుమార్లు నియమించడంతో 8 సంవత్సరాల పాటు బాధ్యతలను దిగ్విజయంగా నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన పార్టీకి అందించిన సేవలను పార్టీ ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయనకు వెన్నంటి ప్రోత్సహిస్తూ వచ్చింది. గత శాసనసభ ఎన్నికల ముందు అశోక్ గౌడ్ ను జిల్లా ప్రచార కో ఆర్డినేటర్ గా నియమించి పార్టీ గెలుపు కోసం ఆయన సేవలను వినియోగించుకుంది. ఇటీవలే కాంగ్రెస్ అగ్రనాయకత్వం అశోక్ గౌడ్ కు మహబూబాబాద్ డిసిసి ఉపాధ్యక్షులుగా నియమించి గౌరవించింది. తాజాగా ఇనుగుర్తి మండలానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎంపిక చేసింది.

*పార్టీ ఏ బాధ్యత అప్పగించిన స్వీకరిస్తా..అశోక్ గౌడ్*

కాంగ్రెస్ పార్టీ తన సేవలను ఏ విధంగా వినియోగించుకున్నా,ఏ బాధ్యత అప్పగించిన క్రమశిక్షణ కలిగిన సైనికునిలా సంతోషంగా స్వీకరిస్తూ అంకితభావంతో పనిచేస్తానని బైరు అశోక్ గౌడ్ అన్నారు. మండల అధ్యక్షుని గా నియమించి పార్టీ తనపై మరింత బాధ్యత ఉంచిందన్నారు.తనపై నమ్మకం ఉంచి అధ్యక్ష బాధ్యతల్లో నియమించిన, ఇందుకు కారకులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, డిసిసి అధ్యక్షురాలు డా.ఉమా మురళి నాయక్,మంత్రి సీతఎంపీలు వేం నరేందర్ రెడ్డి,  బలరాం నాయక్, ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్, మాజీ డిసిసి అధ్యక్షులు భరత్ చందర్ రెడ్డి ల కు కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ జిల్లా,డివిజన్,మండల, వివిధ గ్రామాల నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మండలంలోని పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలను, నాయకులను గుర్తించి ప్రోత్సహిస్తుందనేదితన తన నియామకంతో మరోసారి రుజువైందన్నారు. క్రమశిక్షణతో ప్రతి ఒక్కరం కృషి చేస్తే సరైన సమయంలో పార్టీ అందరినీ గుర్తించి తగిన గౌరవం ఇస్తుందన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.