📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKhammamమాధాపురంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు

మాధాపురంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

మాధాపురంలో ఘనంగా వైయస్ఆర్ జయంతి వేడుకలు



*మన ప్రజావాణి మధిర ఆర్ సి జూలై 8*


ముదిగొండ మండలం మాధాపురం గ్రామంలోనమస్తే అక్కా, నమస్తే చెల్లి…” అంటూ తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి *డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి*  జయంతిని మాధాపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమాన్ని గ్రామ *సర్పంచ్ ఉప్పునూరి నాగమణి వెంకటరెడ్డి* ఆధ్వర్యంలో నిర్వహించారు.

ముందుగా వైయస్ఆర్  విగ్రహానికి పూలమాల వేసి  నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా *ఉప్పునూరి వెంకటరెడ్డి* మాట్లాడుతూ… రైతు పక్షపాతిగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్, పేదల ప్రాణాలు నిలబెట్టిన ‘ఆరోగ్యశ్రీ’, నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’, బీడు భూములకు ప్రాణం పోసిన ‘జలయజ్ఞం’.. ఇలా ఆయన వేసిన ప్రతి అడుగు బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసమేనని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి, నిజమైన ‘ఇందిరమ్మ రాజ్యాన్ని’ పేదవాడి గడప వరకు చేర్చిన ఆయన పాలన మాకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. “రాజన్న అందరివాడు” అని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో *అన్నెం గురువారెడ్డి, అన్నెం వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ గోపిరెడ్డి నాగిరెడ్డి, సోము అంకిరెడ్డి, వార్డు మెంబర్ తంగేళ్ళ ఉపేందర్, చెరువు నాగిరెడ్డి, రెడ్డి మళ్ళ సత్యనారాయణ రెడ్డి. తో పాటు పలువురు నాయకులు, రాజన్న అభిమానులు, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.