📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarబాల వికాస ఆధ్వర్యంలోసామాన్యులకు వరంగా ఉచిత వైద్య శిబిరాలు

బాల వికాస ఆధ్వర్యంలోసామాన్యులకు వరంగా ఉచిత వైద్య శిబిరాలు

📰 Generate e-Paper Clip

బాల వికాస ఆధ్వర్యంలోసామాన్యులకు వరంగా ఉచిత వైద్య శిబిరాలు

* బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన

జమ్మికుంట జూలై 11 (ప్రజావాణి)

వైద్య చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లలేని సామాన్య ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని వీణవంక మండలం బేతిగల్ గ్రామ సర్పంచ్ చొప్పరి సారమ్మసారయ్య అన్నారుబాలవికాస స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో జమ్మికుంట ఆదిత్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సహకారంతో శనివారం బేతిగల్ గ్రామపంచాయతీ ఆవరణలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారుఈ సందర్భంగా నిర్వహించిన అవగాహన సమావేశంలో న్యూరో ఫిజీషియన్ డాక్టర్ భరత్ మాట్లాడుతూ ఆధునిక జీవనశైలి కారణంగా మానసిక ఒత్తిడి పెరిగి బ్రెయిన్ స్ట్రోక్ పక్షవాతం వంటి వ్యాధులు అధికమవుతున్నాయని తెలిపారుజనరల్ ఫిజీషియన్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు. క్యాన్సర్ వంటి వ్యాధుల నివారణకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పోషకాహారాన్ని తీసుకోవడం అవసరమని పేర్కొన్నారుజనరల్ సర్జన్ డాక్టర్ మహిపాల్ మాట్లాడుతూ మైదాతో తయారయ్యే ఆహార పదార్థాలు బజ్జీలు బేకరీ ఉత్పత్తులను తగ్గించి పీచు పదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలనిసూచించారుగైనకాలజిస్ట్ డాక్టర్ గ్రీష్మ మాట్లాడుతూ ఫ్రిజ్‌లో ఎక్కువ రోజుల పాటు నిల్వ చేసిన ఆహారాన్ని వీలైనంత వరకు తీసుకోకుండా తాజాగా వండిన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. మహిళల్లో రక్తహీనత నివారణకు ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలనిసూచించారుజమ్మికుంట బాలవికాస సెంటర్ మేనేజర్ పబ్బు సులోచన మాట్లాడుతూ ప్రతి మహిళ ఆరోగ్యంపై అవగాహన పెంచుకుని కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడేలా కృషి చేయాలని కోరారు మహిళల సాధికారత ఆరోగ్యం బలోపేతం కావడం ద్వారా కుటుంబ వ్యవస్థ మరింత ఆరోగ్యవంతంగా మారుతుందనితెలిపారుబాలవికాస కోఆర్డినేటర్ ఆసియా మాట్లాడుతూ సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్న 180 గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారుఉపసర్పంచ్ మడ్డి మహేష్ మాట్లాడుతూ బాలవికాస సేవలు అభినందనీయమని ఆదిత్య ఆసుపత్రి వైద్య బృందం గ్రామానికే వచ్చి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం ప్రశంసనీయమని అన్నారుఈ శిబిరంలో గ్రామ కారోబార్ పల్లెర్ల మహేష్ బాలవికాస విలేజ్ లీడర్ పల్లెర్ల వనిత ఆదిత్య ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ దేవేందర్ రెడ్డి పీఆర్‌వోలు రఫిక్ దుర్గాప్రసాద్ శ్రీకాంత్ ఆసుపత్రి సిబ్బంది అనిల్ రావు మహేష్ శ్రావణ్ సుచిత్ర సంతోషిని సుమలతతో పాటు గ్రామ పెద్దలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.