📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్బద్వేల్ మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్: టీడీపీలోకి చేరిన 40 కుటుంబాలు!

బద్వేల్ మున్సిపాలిటీలో వైసీపీకి భారీ షాక్: టీడీపీలోకి చేరిన 40 కుటుంబాలు!

📰 Generate e-Paper Clip

బద్వేల్,(జూలై 25 ప్రజావాణి) నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గ వైసీపీ విభాగంలో తీవ్ర కుదుపు మొదలైంది. తాజాగా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డుకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ముఖ్య నాయకులు,కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) లోకి చేరారు.మంచూరి  సూర్యనారాయణ రెడ్డి బద్వేల్ నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నియోజకవర్గంలో సరికొత్త రాజకీయ జోష్ కనిపిస్తోందని, ఆయన నాయకత్వంపై నమ్మకంతోనే ప్రజలు, నాయకులు స్వచ్ఛందంగా టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.పసుపు కండువా కప్పిన ముఖ్య నేతలు 22వ వార్డులో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వైసీపీకి చెందిన సుమారు 40 కుటుంబాలు అధికారికంగా తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి, అలాగే 21 మరియు 22వ వార్డుల ఇన్‌ఛార్జ్ మాచుపల్లి కృష్ణారెడ్డి హాజరయ్యారు.పార్టీలోకి చేరిన నాయకులకు, మహిళలకు వారు పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు.మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయం ఈ సందర్భంగా మాచుపల్లి లక్ష్మీదేవి మరియు మాచుపల్లి కృష్ణారెడ్డి మాట్లాడుతూ, బద్వేల్ మున్సిపాలిటీలో వైసీపీ గ్రాఫ్ రోజురోజుకూ పడిపోతోందని విమర్శించారు.రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేశారు.నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బద్వేల్ రూపురేఖలు మారుతాయని,ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందని వారు స్పష్టం చేశారు.వైసీపీలో ఉన్న అసంతృప్తి వల్లే వార్డుల్లోని కీలక నేతలు బయటకు వస్తున్నారని,రాబోయే రోజుల్లో మరిన్ని చేరికలు ఉంటాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు,శివా చారి,కుమారి,సుబ్బాచారి,అనూష,పరిపూర్ణ చారి,మౌనిక,రమణ చారి,భవాని,కృష్ణమాచారి, మమత,విశ్వరూపచారి,లక్ష్మి దేవి,శంకరచారి, నారాయణమ్మ,శివనగచారి,లక్ష్మి,గురమ్మ,మల్లయ్య, సుబ్బారావుడు,చిన్న మల్లయ్య, రమేష్,స్థానిక 22వ వార్డు టీడీపీ కార్యకర్తలు మరియు కొత్తగా చేరిన కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.