📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJayashankar Bhupalpallyఫాస్ట్ ఫుడ్ సెంటర్ యువకుడు హత్య

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యువకుడు హత్య

📰 Generate e-Paper Clip

ఫాస్ట్ ఫుడ్ సెంటర్ యువకుడు హత్య
జయశంకర్ భూపాలపల్లి జిల్లారేగొండ మండలంలోఫాస్ట్ ఫుడ్ సెంటర్ యువకుడు హత్య జరిగిన సంఘటన మండల కేంద్రంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలలో ఉన్నాయి. మండలంలోని రంగయ్య పల్లి గ్రామానికి చెందిన జట్టి శ్రావణ్ (35) అనే యువకుడు మండల కేంద్రంలో వైన్స్ షాప్ ఎదుట ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం రాత్రి 10 గంటలకు షాప్ ముసి ఇంటికి వెళ్తుండగా మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు హత్య చేసినట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. హత్యకు గల కారణాలు, సంఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. యువకుడిని హత్య చేసిన మరో యువకుడు పరారీలో ఉన్నట్లు ఎస్సై దాసరి సుధాకర్ తెలిపారు. మృతునికి భార్య మౌనిక, కూతురు, కుమారుడు ఉన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.