📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

📰 Generate e-Paper Clip

*ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ* 

*మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:- జూలై 27

ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లాలోని రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన నిరుపేద బోడ సారయ్య కుటుంబానికి సోమవారం నిత్యావసర వస్తువుల పంపిణీ చేశారు. ఈసందర్భంగా సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ అజీమొద్దీన్, ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవా లు మాట్లాడుతూ,
పుట్టినరోజును సేవా కార్యక్రమంతో జరుపుకోవాలనే మానవతా దృక్పథంతో మార్తా లావణ్య ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబానికి అండగా నిలిచారని తెలిపారు. రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన బోడ సారయ్య వృత్తిరీత్యా ప్లంబింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారని, ఇటీవల అనారోగ్య కారణంగా కిడ్నీ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి రావడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు. ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో అవసరమైన మందులు, నిత్యావసర వస్తువులు సైతం సమకూర్చుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వారి దయనీయ పరిస్థితిని గురించి మార్తా లావణ్య సంప్రదించి వివరించగా, ఆమె తన పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించాలని ముందుకు వచ్చి, బోడ సారయ్య కుటుంబానికి నిత్యావసర వస్తువులను అందజేశారని తెలిపారు. బోడ సారయ్య  కుటుంబానికి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎవరైనా ఆపదలో ఉన్నా లేదా సహాయం అవసరమైనా తమకు తెలియజేస్తే, తమ వంతు సహాయాన్ని అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. నేటి సేవా కార్యక్రమానికి సహకరించి తన పుట్టినరోజును సమాజ సేవకు అంకితం చేసిన మార్తా లావణ్య కు సొసైటీ తరపున ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో  సొసైటీ జిల్లా అధ్యక్షుడు నందిపాట రాజ్ కుమార్, కార్యదర్శి గాండ్ల సంజీవ్, మందమర్రి మండల అధ్యక్షుడు సకినాల శంకర్, సభ్యులు ఎండి జావిద్ ఖాన్, పాషా, మామిడి అజయ్, పృథ్వి లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.