📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialఉద్యమకారులకు కాలయాపన లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి

ఉద్యమకారులకు కాలయాపన లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి

📰 Generate e-Paper Clip

*ఉద్యమకారులకు కాలయాపన లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలి* 

* *మన ప్రజావాణి* మందమర్రి:- జూలై 27

తెలంగాణ ఉద్యమకారులకు ఉద్యమకారుల గుర్తింపు కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా సంక్షేమ పథకాలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు కొలుగూరి విజయ్ కుమార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని డిమాండ్ చేశారు. సోమవారం పట్టణంలోని సింగరేణి ఉన్నత పాఠశాల మైదానంలో జిల్లా కమిటీ, పట్టణ కోర్ కమిటీ, మండల కోర్ కమిటీ సభ్యులతో సమావేశం  నిర్వహించారు. ఈసందర్భంగా ఫోరం జిల్లా అధ్యక్షుడు కొలుగూరి విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఉద్యమకారులను 3 కేటగిరీలుగా విభజించాలని సూచించారు. మొదటి కేటగిరీలో 1969 సంవత్సరం నుంచి 2014 వరకు ఉద్యమంలో చనిపోయిన లేదా దివ్యాంగులుగా మారిన వారిని గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలని, రెండవ కేటగిరీలో 2001 సంవత్సరం నుండి 2009 సంవత్సరం వరకు పనిచేసిన కవులు, గాయకులు, ఉద్యమకారులను గుర్తించి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మూడవ కేటగిరీలో 2009 సంవత్సరం టి జెఏసి ఆధ్వర్యంలో 2014 సంవత్సరం వరకు పనిచేసిన సకలజనుల సంఘాల ఉద్యమకారులను గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు మడిపెల్లి వెంకటేశం గౌడ్, నామని ముత్తయ్య, మొయ్య రాంబాబు, సురేందర్, సంఘీ సంతోష్, దాసరి రాజనర్సు, పోలు కుమార్, సలామొద్దీన్, ఖలీమ్, ఎండి పాషా, బొలిశెట్టి రామచందర్, బొల్లం రమేష్, పెనుగొండ సమ్మయ్య, పల్లె నరసింహులు, కొండిల్లా శ్రీనివాస్, పాత వీరస్వామి, ముల్కల రమేష్ లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.