📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMuluguతెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి మంత్రి సీతక్క పిలుపు నీటి సంరక్షణే మన భవిష్యత్తు-...

తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి మంత్రి సీతక్క పిలుపు నీటి సంరక్షణే మన భవిష్యత్తు- చింత క్రాంతి

📰 Generate e-Paper Clip

 

*ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)*
నీరు ఉండగనే జీవితం.. నీటి సంరక్షణే మన భవిష్యత్తు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జలసిరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారు పిలుపునిచ్చారు.
ప్రతి నీటి బొట్టును సంరక్షించి వచ్చే జలసిరి తెలంగాణ నిర్మాణంలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని సూచించారు.
ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి చెరువు అనే నినాదంతో నీటి సంరక్షణ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో, మంత్రి సీతక్క ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింత క్రాంతి మాట్లాడుతూ జలసిరి కార్యక్రమాన్ని ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకువస్తామని అన్నారు.
నీటి పొదుపు, వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ పనుల్లో కార్యకర్తలు చురుగ్గా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

*బై రిపోర్టర్: గొల్లపెల్లి లక్ష్మీ శ్రీకాంత్*

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.