తెలంగాణ జలసిరి కార్యక్రమంలో భాగస్వాములు కావాలి మంత్రి సీతక్క పిలుపు నీటి సంరక్షణే మన భవిష్యత్తు- చింత క్రాంతి

  *ములుగు జిల్లా ప్రతినిధి (ప్రజావాణి)* నీరు ఉండగనే జీవితం.. నీటి సంరక్షణే మన భవిష్యత్తు అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ జలసిరి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి శ్రీమతి దనసరి అనసూయ సీతక్క గారు పిలుపునిచ్చారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించి వచ్చే జలసిరి తెలంగాణ నిర్మాణంలో కాంగ్రెస్ కార్యకర్తలు ముందుండాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పొలానికి పంట కుంట, ప్రతి ఊరికి చెరువు అనే నినాదంతో నీటి సంరక్షణ కార్యక్రమాలను విజయవంతం...