📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaతాళ్లపల్లిలో భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాల ఉత్సవాలు

తాళ్లపల్లిలో భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాల ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

తాళ్లపల్లిలో భక్తిశ్రద్ధలతో పోచమ్మ బోనాల ఉత్సవాలు
విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో ఘన నిర్వహణ – మహిళల బోనాల సమర్పణ, ప్రత్యేక పూజలు
ఇల్లంతకుంట, ప్రజావాణి:
ఇల్లంతకుంట మండలం తాళ్లపల్లి గ్రామంలో విశ్వకర్మ మనుమయ సంఘం ఆధ్వర్యంలో పోచమ్మ బోనాల ఉత్సవాలను ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామ మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించి పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా డప్పు చప్పుళ్ల నడుమ భక్తులు ఊరేగింపుగా వెళ్లి పోచమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా, ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో వైభవంగా కొనసాగాయి.
వేడుకల్లో విశ్వకర్మ మనుమయ సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేశారు. గ్రామ ప్రజలు సుఖసంతోషాలు, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలని, మంచి వర్షాలు కురవాలని పోచమ్మ తల్లిని ప్రార్థించారు. అనంతరం మంగళహారతులతో బోనాల ఉత్సవాలు భక్తిపారవశ్యంతో ఘనంగా ముగిశాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.