📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

📰 Generate e-Paper Clip

డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

మాదకద్రవ్యాల నివారణపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కల్పించాలి

జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురం బ్యూరో జులై 25 మన ప్రజా వాణి

అనంతపురం జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో మాదకద్రవ్యాల నియంత్రణ చర్యలు మరియు ఎన్సిఓఆర్డీ (నార్కో కోఆర్డినేషన్ సెంటర్, NCORD) జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ ఎస్పీ పి.జగదీష్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాను డ్రగ్ ఫ్రీ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యాసంస్థల్లో వారానికొకసారి అవగాహన కార్యక్రమాలు డిఈఓ, ఆర్ఐఓ, ఆర్జెడిలు పాఠశాలలు మరియు కళాశాలల్లో డ్రగ్స్, గంజాయి దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమాలు అన్ని విద్యాసంస్థలు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.
నిర్వహించిన కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, చర్చించిన అంశాలు మరియు ఇతర వివరాలను తప్పనిసరిగా గూగుల్ ఫారంలో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.
ప్రైవేట్ పాఠశాలల ఈగల్ క్లబ్ వివరాలు
జిల్లాలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు సంబంధించిన ఈగల్ క్లబ్ వివరాల ఫిజికల్ కాపీలను డీసీఆర్‌బీకి పంపించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
హాట్‌స్పాట్ ప్రాంతాల పరిశుభ్రత
కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఉన్న చెరువుకట్ట దిగువనున్న పార్కును పూర్తిగా శుభ్రపరచాలని మున్సిపల్ కమిషనర్‌కు ఆదేశించారు. పార్కు పరిసరాల్లో ఉన్న నిరుపయోగ (Abandoned) ప్రదేశాలు మరియు హాట్‌స్పాట్ ప్రాంతాలను గుర్తించి వెంటనే క్లియర్ చేయాలన్నారు.’పల్లెబాటలో ఈగల్’ కార్యక్రమం వ్యవసాయ శాఖ, అటవీ శాఖ, పోలీసు శాఖ మరియు ఈగల్ సెల్ సమన్వయంతో జిల్లాలోని గుర్తించిన గ్రామాలు, అన్ని పోలీస్ స్టేషన్ పరిధుల్లో గంజాయి సాగు నివారణ మరియు మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. జీఎస్టీ/కమర్షియల్ ట్యాక్స్ శాఖ అధికారులు తమ విధుల నిర్వహణలో గంజాయి లేదా మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం లభిస్తే తప్పనిసరిగా పోలీసు శాఖకు తెలియజేయాలన్నారు. విద్యాసంస్థల 500 మీటర్ల పరిధిలో నిషేధిత విక్రయాలు విద్యాసంస్థల 500 మీటర్ల పరిధిలో పొగాకు ఉత్పత్తులు, గంజాయి, మాదకద్రవ్యాలు మరియు ఇతర నిషేధిత పదార్థాల విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలపై తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు జరిమానాలు విధించాలని సంబంధిత శాఖలకు సూచించారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి సాగుకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే అన్ని శాఖలు, ముఖ్యంగా అటవీ శాఖ అధికారులు, పోలీసు శాఖ మరియు ఈగల్ సెల్‌కు వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు.
జిల్లా ఎస్పీ పి.జగదీష్ మాట్లాడుతూ పోలీసు శాఖ మరియు ఈగల్ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించే డ్రగ్స్ వ్యతిరేక అవగాహన సదస్సులు, సెమినార్లు, ర్యాలీలు మరియు ఇతర కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని పాఠశాలలు  కళాశాలల యాజమాన్యాలను ఆదేశించారు.
యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడడం విద్యాసంస్థలు, పోలీసు శాఖ, ఈగల్ సెల్ మరియు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి విద్యార్థుల్లో మాదకద్రవ్యాల పట్ల అవగాహన పెంచి, డ్రగ్-ఫ్రీ క్యాంపస్‌లుగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఎల్ఈ సమావేశంలో డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్ వలి భాష, ఈగల్ నోడల్ ఆఫీసర్ జయపాల్ రెడ్డి,
ఈగల్ సబ్-ఇన్‌స్పెక్టర్ బి. హనుమంతు,
జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.