📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కవలకుంట్ల  గ్రామంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు...

కవలకుంట్ల  గ్రామంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం మరియు మంద కృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి 

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ళ (ప్రజావాణి జులై 07)  కవలకుంట్ల గ్రామంలో ఎమ్మార్పీఎస్  ఆవిర్భావ దినోత్సవం, అలాగే ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి జన్మదిన వేడుకలను మంగళవారం గ్రామంలో అత్యంత వైభవంగా, ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలో దండోరా జెండాను ఆవిష్కరించి, కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాదిగ ఉద్యోగుల సమాఖ్య జాతీయ కమిటీ సభ్యులు ఓబుళాపురం శోభన్ కుమార్ఎంఈయఫ్ జిల్లా గౌరవాధ్యక్షులు సగిలి జాకోబ్ , మరియు రిటైర్డ్ ఉపాధ్యాయులు *నారిపోగు సింహరాయలు* హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల హక్కుల కోసం, మాదిగల సాధికారత కోసం ఎమ్మార్పీఎస్ చేసిన పోరాటాలు అమోఘమైనవని కొనియాడారు.పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వం, ఆయన పడుతున్న శ్రమ దేశవ్యాప్తంగా ఉన్న ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. మాదిగలు రిజర్వేషన్ల వర్గీకరణ ఫలాలు అందిపుచ్చుకునే దిశగా ప్రతి ఒక్కరూ ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంద కృష్ణ మాదిగ గారి ఆశయ సాధన కోసం, సమాజంలో సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ దండోరా జెండా నీడన నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.ఈ విజయవంతమైన సంబరాల్లో ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు నారిపోగు మనోజ్ సాగర్, పోరుమామిళ్ళ మండల అధ్యక్షులు వీరపోగు రాజేష్, కవలకుంట్ల గ్రామ కమిటీ నాయకులు జోజి, బాలుడు, నాగేష్‌ పెద్ద సంఖ్యలో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మరియు దండోరా అభిమానులు పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.