ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ను కలిసిన
బూడిద రాజు.
మన ప్రజావాణి. మంథని ప్రతినిధి. మంథని మండలం దుబ్బ పల్లి గ్రామంలో ని దళిత కులానికి చెందిన బూడిద రాజు సిరిపురం శివారులోని 173 సర్వే నెంబర్ లో గల ప్రభుత్వ భూమిని గత పది సంవత్సరాలుగా సాగు చేసుకుని జీవిస్తున్నాడు ఆ భూమి విషయంలో పెద్దపెల్లి కలెక్టర్ ఆఫీస్ లో పట్టా కోసం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది అప్పటి మంథని ఎమ్మార్వో మోకా మీదికి ఆర్ ఐ ని పంపించాడు అతను దానిని చూసి నేను మోకాపై ఉన్నందున నాకు మూక కాగితం కూడా ఇచ్చారు నేను అప్పటినుండి సాగు చేసుకుంటున్నాను టిఆర్ఎస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనం అని నేను దున్నుకున్న భూమిని ట్రాక్టర్ తో దొబ్బిచ్చి చెట్లు పెట్టినారు నా జీవనోదారమైన భూమిని నాకు లేకుండా చేశారు కాబట్టి నాకు మోకా కాగితం ఉన్నందున మళ్లీ సర్వే చేపించి నాకు మూడు ఎకరాల భూమిని ఇప్పించగలరని కోరుతున్నాను


