హాసన్‌పర్తిలో ఉద్యమకారుల గర్జన.. ఐక్య వేదికకు కొత్త సారథ్యం!
ఎర్రగట్టుగుట్టలో ఓదార్పు యాత్ర పోస్టర్ ఆవిష్కరణఉద్యమకారుల సమక్షంలో నూతన మండల కమిటీ ఏర్పాటుఅధ్యక్షుడిగా మేకల కన్నయ్య ఎన్నికహాసన్‌పర్తి:రిపోర్టర్ ప్రణయ్ గొర్రె,
తెలంగాణ ఉద్యమకారుల ఐక్య వేదిక రాష్ట్ర చైర్మన్ శ్రీ గుడిమల్ల రవికుమార్ ఆదేశాల మేరకు హాసన్‌పర్తి మండలంలో ఉద్యమకారుల ఓదార్పు యాత్ర పోస్టర్‌ను ఎర్రగట్టుగుట్ట సర్కిల్‌లో ఘనంగా ఆవిష్కరించారు. శ్రీ అరికే రాంకుమార్, దామెర సాగర్, పొలంపల్లి మల్లేశం, బట్టు పూర్ణచందర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు.హన్మకొండ జిల్లా ఇన్‌చార్జీలు శ్రీ అనుముల రమేష్, మొగసాల దేవేందర్ రెడ్డి, గోపనబోయిన రాజు, మేకల రవీందర్, ఇమ్మడి శెట్టి రాజు, సౌరం స్వర్ణలత, గుంటి పద్మ, దార సూరి, బెరిగేలా కృష్ణమూర్తి, బైరి రమేష్, జక్కుల స్వామి, జీనుకలా లక్ష్మణరావు తదితరుల సమక్షంలో పోస్టర్ ఆవిష్కరణ జరిగింది.మండల కమిటీ ఏర్పాటుఅనంతరం ఉద్యమకారుల ఐక్య వేదిక హాసన్‌పర్తి మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా మేకల కన్నయ్యను ఎన్నుకోగా, ఉపాధ్యక్షులుగా గోపనబోయిన రవీందర్, మెరుగుత్తి రఘు, ఆరెపల్లి రాజు, తంగేళ్లపెల్లి కోటేశ్వర్‌లను ఎంపిక చేశారు.ప్రధాన కార్యదర్శిగా సౌరం రవీందర్, సహాయ కార్యదర్శులుగా రుద్రారపు రవీందర్, దాట్ల ప్రభాకర్‌లను ఎన్నుకున్నారు. సభ్యులుగా దాసరి శంకర్, పూల కృష్ణమోహన్, ఉచిత రాజు, ఓర్సు రమేష్, ఎస్‌కే. అనుకుస్పాషా, పోతారాజు సురేందర్‌లను ఎంపిక చేశారు.మహిళా కమిటీకి కొత్త బాధ్యతలుమహిళా కమిటీ అధ్యక్షురాలిగా మోతపోతుల లక్ష్మి, ఉపాధ్యక్షులుగా సిరిమల్ల గాయత్రి, కందగట్ల రమలను ఎన్నుకున్నారు.నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఉద్యమకారుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పనిచేస్తామని తెలిపారు. రాబోయే కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ఉద్యమకారులంతా సహకరించాలని పిలుపునిచ్చారు.
హాసన్‌పర్తిలో ఉద్యమకారుల గర్జన.. ఐక్య వేదికకు కొత్త సారథ్యం
RELATED ARTICLES

