📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన -గుగ్గిళ్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై మండల వ్యవసాయ అధికారి...

ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన -గుగ్గిళ్లలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై మండల వ్యవసాయ అధికారి సంతోష్ సూచనలు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 25 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో ఎల్ నినో ప్రభావంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి సంతోష్ మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు నీటి లభ్యతకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.
తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటలను ఎంపిక చేసుకోవాలని, వ్యవసాయ శాఖ సూచనలను పాటిస్తూ శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపడితే నష్టాలను తగ్గించుకోవచ్చని తెలిపారు. రైతులు తమ సమీప వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి పంటల ఎంపిక, సాగు విధానాలపై తగిన సలహాలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉపసర్పంచ్ దూగ్యని లావణ్య–మోహన్, ర్యాకం అనిత, పోతు భూలక్ష్మి, కొంకటి కుమార్, కొంకటి సురేష్, కొంకటి సంపత్, దూశెట్టి రాజు, వెంకటేష్, లావణ్య, పంచాయతీ కార్యదర్శి వంశీ,ఫీల్డ్ అసిస్టెంట్ రాజు,కా రోబార్ అశోక్, వీవోఏ భాగ్య, అంగన్‌వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.