📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఆధారాలతో నిరూపిస్తే ఎమ్మెల్యేతో రాజీనామా చేయిస్తాం  లేదంటే ఎమ్మెల్సీ రాజీనామాకు సిద్ధమా కొందుర్గు...

ఆధారాలతో నిరూపిస్తే ఎమ్మెల్యేతో రాజీనామా చేయిస్తాం  లేదంటే ఎమ్మెల్సీ రాజీనామాకు సిద్ధమా కొందుర్గు కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి

📰 Generate e-Paper Clip

ఆధారాలతో నిరూపిస్తే ఎమ్మెల్యేతో రాజీనామా చేయిస్తాం

లేదంటే ఎమ్మెల్సీ రాజీనామాకు సిద్ధమా

కొందుర్గు కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి

 

సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొందుర్గు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోగురి పురుషోత్తం రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ రూ.50 కోట్లు తీసుకున్నారని చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆధారాలు లేకుండా ఇటువంటి ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు. సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ రద్దు కోసం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిరంతరం కృషి చేశారని, ఆయన నిజాయితీపై నియోజకవర్గ ప్రజలకు పూర్తి అవగాహన ఉందన్నారు. గతంలో కూడా తప్పుడు సమాచారంతో శాసన మండలిలో వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, ఇప్పుడు కూడా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

“ఎమ్మెల్యే శంకర్ రూ.50 కోట్లు తీసుకున్నారని ఆధారాలతో నిరూపిస్తే మా నాయకుడితో రాజీనామా చేయించడానికి మేము సిద్ధం. అదే విధంగా ఆరోపణలు నిరూపించలేకపోతే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడానికి నవీన్ రెడ్డి సిద్ధమా?” అని పురుషోత్తం రెడ్డి సవాల్ విసిరారు.

అలాగే ఆధారాలు చూపించలేని పక్షంలో ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని, చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. “నిజాయితీ కలిగిన ప్రజాప్రతినిధిపై అవాస్తవ ఆరోపణలు చేయడం తగదు. ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు, నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి” అని పురుషోత్తం రెడ్డి పేర్కొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.