📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyసిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్న గారి పై ఎమ్మెల్సీ...

సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్న గారి పై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి

📰 Generate e-Paper Clip

సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ అన్న గారి పై ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలి

*50 కోట్లు కాదు కదా 50 రూపాయలు తీసుకున్న ఒక గౌరవప్రదమైన శాసనమండలి సభ్యుడిగా ఉన్న మీరు వాటిని ఆధారాలతో నిరూపించాలి*

వీర్లపల్లి శంకర్ అన్న గారి నిజాయితీ ఏంటో నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ పనిచేస్తున్న అధికారులకి అందరికీ తెలుసు

డబ్బులతో ఎవరు వ్యవహారం చేస్తారో నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి తెలుసు

కాంగ్రెస్ పార్టీ నుండి జడ్పిటిసిగా గెలిచి బీఆర్ఎస్ పార్టీ తరఫున జడ్పీ వైస్ చైర్మన్ గా ఎలా అయ్యావో ముందు దానికి సమాధానం చెప్పాలి

సూర్యుడిపై ఉమ్మితే అది ఉమ్మిన వారి ముఖం పైనే పడుతుంది

వీర్లపల్లి శంకర్ అనే వ్యక్తి సూర్యుడు లాంటివారుజిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి జితేందర్ రెడ్డి

సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ వ్యవహారంలో శాసనమండలి సభ్యులు నవీన్ రెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్ గారి పై చేసిన ఆరోపణలు నిరాధారం వాటికి ఏవైనా ఆధారాలు ఉంటే వాటిని పత్రికాముఖంగా సాక్షాలతో బయటపెట్టి మాట్లాడాలి

అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు సహించరు

మీ అధిష్టానం దృష్టిలో పడడానికి రాబోయే ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ తీసుకోవడానికి మచ్చలేని నాయకుడు శంకరన్న గారిపై నిందలు వేయడం సరికాదు

మీకు చేతనైతే ఒక శాసనమండలి సభ్యుడిగా నియోజకవర్గానికి నిధులు తీసుకొని వచ్చి అభివృద్ధి చేయాలి

సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ రద్దు చేయడానికి వీర్లపల్లి శంకరన్న చేస్తున్న కృషి మీరు తెలుసుకుంటే మంచిది

ప్రభుత్వంలో ఉన్నందున ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేసే విధంగా శంకర్ గారు కృషి చేస్తా ఉన్నారు

ఆనాడు ప్రజల నుండి బలవంతంగా భూములు గుంజుకున్నది ఆనాటి మీ ప్రభుత్వం కాదా

డంపింగ్ యార్డ్ రద్దు చేయాలని ప్రతిపక్షంగా మీరే విధంగా అడుగుతున్నారో అధికారపక్షంగా మేము అడిగే విధంగానే ప్రభుత్వంతో అడుగుతున్నాము

నిజా నిజాలు తెలుసుకోకుండా అడ్డగోలుగా మాట్లాడడం మీ అవివేకానికి నిదర్శనం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.