📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyఅలంపూర్ గద్వాల్ నియోజకవర్గాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో పాల్గొన్న  ఎమ్మెల్యే వీర్లపల్లి...

అలంపూర్ గద్వాల్ నియోజకవర్గాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో పాల్గొన్న  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

📰 Generate e-Paper Clip

అలంపూర్ గద్వాల్ నియోజకవర్గాల్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటనలో పాల్గొన్న  ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
మహాన్ న్యూస్ డెస్క్ బ్యూరో జులై 14:
నేడు అలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు గారి పర్యటనలో షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ చైర్మన్ శ్రీ వీర్లపల్లి శంకర్ గారు పాల్గొన్నారు.

ఈ పర్యటనలో భాగంగా మొదట వడ్డేపల్లి మండలంలోని జూలెకల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన *33/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను* ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రారంభించారు. అనంతరం మల్దేకల్ మండలంలోని కూర్తిరావాల చెరువు గ్రామంలో  33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా జూలెకల్ గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే  గారు మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒకేసారి రూ.9,000 కోట్ల రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని అన్నారు. రైతులకు ఎలాంటి విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా అలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున విద్యుత్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా 12 నూతన సబ్‌స్టేషన్లు, భారీ సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు ద్వారా రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. గతంలో అసాధ్యమని భావించిన రైతు రుణమాఫీని అమలు చేసి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఆత్మబంధువుగా నిలిచిందని, రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గారు స్పష్టం చేశారు.రాష్ట్ర అబ్కారీ మరియు పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు,రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య, యువజన సర్వీసులు, మరియు క్రీడల శాఖ మంత్రి వర్యులు వాకిటి శ్రీహరి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి,తెలంగాణ రాష్ట్ర గొర్రెలు మరియు మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ సరిత తిరుపతయ్య, స్థానిక పార్లమెంట్ సభ్యులు మల్లు రవి,అలంపూర్ నియోజక ఇంచార్జీ సంపత్,తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.