📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అట్లూరు క్రాస్ రోడ్డులో విస్తృతంగా వాహనాల తనిఖీలు: ఎస్సై నాగ కీర్తన

అట్లూరు క్రాస్ రోడ్డులో విస్తృతంగా వాహనాల తనిఖీలు: ఎస్సై నాగ కీర్తన

📰 Generate e-Paper Clip

కడప జిల్లా అట్లూరు జూలై 31ప్రజావాణి మండలంలోని అట్లూరు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్సై) నాగ కీర్తన ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ఈ తనిఖీల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రహదారిపై వెళ్తున్న పలు వాహనాలను ఆపి,వాటికి సంబంధించిన పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు.ట్రాఫిక్ నిబంధనలుతప్పనిసరి:వాహనాల తనిఖీల్లో భాగంగా ఎస్సై నాగ కీర్తన వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆమె కోరారు.ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణ రక్షణ కోసం తప్పకుండా హెల్మెట్ ధరించాలని స్పష్టం చేశారు.అలాగే వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్,డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ మరియు పొల్యూషన్ సర్టిఫికెట్ వంటి అన్ని రకాల చెల్లుబాటు అయ్యే పత్రాలను ఎల్లప్పుడూ తమ వెంట ఉంచుకోవాలని సూచించారు.చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు:నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం జరిమానాలు విధిస్తామని ఎస్సై హెచ్చరించారు. అదేవిధంగా,అక్రమ రవాణా,మద్యం లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆమె తేల్చి చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు,ప్రమాదాల నివారణకు ప్రజలు,వాహనదారులు పోలీసులకు సహకరించాలని ఈ సందర్భంగా కోరారు.ఈ తనిఖీ కార్యక్రమంలో అట్లూరు పోలీస్ సిబ్బంది మరియు స్థానికులు పాల్గొన్నారు.
RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.