నేరేడుచర్ల టౌన్ హాల్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కార్యక్రమం
నేరేడుచర్ల, ప్రజావాణి జూన్ 20: SIR కార్యక్రమంలో భాగంగా నేరేడుచర్ల పట్టణంలోని టౌన్ హాల్‌లో మండల పరిధిలోని వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటరు జాబితాల నిర్వహణ, ఎన్నికల ప్రక్రియలో బూత్ లెవెల్ ఏజెంట్ల బాధ్యతలు, నిబంధనలు మరియు విధివిధానాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
కార్యక్రమానికి హుజూర్‌నగర్ ఆర్డీవో శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు. తహసీల్దార్ సైదులు మాట్లాడుతూ ఓటరు జాబితాల పరిశీలన, సవరణల ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు చురుకుగా పాల్గొనాలని సూచించారు.
ట్రైనర్ శ్రీను బూత్ లెవెల్ ఏజెంట్లకు SIR కార్యక్రమం అమలు విధానం, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మరియు క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన విధానాలపై శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు పాల్గొన్నారు.

