📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSiddipetసిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ట్రాఫిక్ ఏసీపీ యం.సుమన్ కుమార్..స్టేషన్ రికార్డులు,...

సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ట్రాఫిక్ ఏసీపీ యం.సుమన్ కుమార్..స్టేషన్ రికార్డులు, ఈ-చలాన్  ప్రమాదాల రిజిస్టర్ల సమగ్ర పరిశీలన..

📰 Generate e-Paper Clip

సిద్దిపేట్ జూన్ 9, ప్రజావాణి

సిద్దిపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌ను మంగళవారం మధ్యాహ్నం ట్రాఫిక్ ఏసీపీ యం.సుమన్ కుమార్, సందర్శించి, సమగ్ర తనిఖీలు నిర్వహించారు. స్టేషన్‌లో అందుబాటులో ఉన్న వసతులు, సిబ్బంది పనితీరు మరియు రికార్డుల నిర్వహణను ఆయన స్వయంగా పరిశీలించారు.ఈ తనిఖీ సందర్భంగా ఏసీపీ  స్టేషన్ పరిసరాలను, సిబ్బంది హాజరును, ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యకలాపాలను  ట్రాఫిక్ నిర్వహణ ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా స్టేషన్‌కు సంబంధించిన కింది అంశాలను ప్రత్యేకంగా తనిఖీ చేశారు: పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్ పరిష్కారాలు, పరిపాలనా రికార్డులను నిశితంగా తనిఖీ చేశారు. స్టేషన్ రికార్డుల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూనే, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను నిరంతరం కాపాడుకోవాలని సూచించారు. అలాగే అందుబాటులో ఉన్న వివిధ సాంకేతికపరికరాలపనితీరునుపరిశీలించారు.పట్టణంలో ట్రాఫిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను మరింత బలోపేతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. రోడ్డు భద్రతా చర్యలు చేపట్టడం ద్వారా ప్రమాదాల నివారణకు కృషి చేయాలని, పెండింగ్‌లో ఉన్న వివిధ పనులను సత్వరం పరిష్కరించాలని ట్రాఫిక్ ఏసిపి సుమన్ కుమార్ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.