📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyసిగాచి ప్రమాదానికి ఏడాది బాధితులకు న్యాయం చేయాలి మాద్రి పృథ్వీరాజ్

సిగాచి ప్రమాదానికి ఏడాది బాధితులకు న్యాయం చేయాలి మాద్రి పృథ్వీరాజ్

📰 Generate e-Paper Clip

•సిగాచి ప్రమాదానికి ఏడాది… బాధితులకు న్యాయం చేయాలి: మాద్రి పృథ్వీరాజ్

 

పటాన్‌చెరు, జూన్ 30(ప్రజావాణి): సిగాచి పరిశ్రమలో జరిగిన ఘోర ప్రమాదానికి ఏడాది పూర్తైన సందర్భంగా పాశమైలారం బీపీఎల్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కార్మికులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి బీఆర్ఎస్ నాయకుడు మాద్రి పృథ్వీరాజ్ పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా మాద్రి పృథ్వీరాజ్ మాట్లాడుతూ, ప్రమాదం జరిగి ఏడాది గడిచినా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల జ్ఞాపకార్థం బీఆర్ఎస్ పార్టీ సంస్మరణ సభ నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి నిరాకరించడం బాధాకరమని అన్నారు.

అనుమతి లభించకపోయినా సభా స్థలం సమీపంలో అమరవీరులకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. సిగాచి ప్రమాద బాధిత కుటుంబాలకు పూర్తి న్యాయం జరిగే వరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని  స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.